BJP MP: 5 ఏళ్ల చిన్నారి సమాధానంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న ప్రధాని !

You have a job in Lok Sabha BJP MP 5 year old daughter leaves PM Modi in splits
  • ప్రధానిని  కలుసుకున్న బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా
  • ఆయన వెంట ఐదేళ్ల కుమార్తె, కుటుంబ సభ్యులు
  • తాను ఏం చేస్తానో తెలుసా? అంటూ చిన్నారిని ప్రశ్నించిన ప్రధాని
  • లోక్ సభలో ఉద్యోగం చేస్తారుగా? అని బదులిచ్చిన పాప
ఊపిరిసలపని పనులతో నిత్యం బిజీగా వుండే ప్రధాని నరేంద్ర మోదీని.. పెద్దగా.. హాయిగా నవ్వుకునేలా చేసింది ఐదేళ్ల చిన్నారి. ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తన కుటుంబ సభ్యులతో కలసి నిన్న పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీని ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ఫిరోజియా వెంట ఆయన కుమార్తె ఐదేళ్ల చిన్నారి అహనా ఫిరోజియా కూడా ఉంది.  ఆమెతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు వేశారు. ‘నేను ఎవరో నీకు తెలుసా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘తెలుసు. మీరు మోదీజీ. మీరు రోజూ టీవీలోకి వస్తారుగా’ అంటూ చిన్నారి అమాయకంగా బదులిచ్చింది. 

తర్వాత ‘నేను ఏం చేస్తానో నీకు తెలుసా?’ అని ప్రధాని అడిగారు. ‘మీరు లోక్ సభలో పనిచేస్తారుగా’ అని చెప్పడంతో.. అక్కడే ఉన్న అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి ప్రధాని సైతం కడుపుబ్బా నవ్వారు. పాపకు చాక్లెట్ ఇచ్చి పంపారు. 

ప్రధాని చిన్న పిల్లలతో మమేకం అయిన ప్రతి సందర్భంలోనూ వారిని ప్రశ్నించడం అలవాటు. ప్రధానితో భేటీ వివరాలను అనిల్ ఫిరోజియా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఈ రోజు మరిచిపోలేనిది. ప్రపంచ నేత, ఎంతో విజయవంతమైన ప్రధాని, గౌరవనీయ మోదీజీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని అనిల్ ఫిరోజియా పోస్ట్ పెట్టారు. 

BJP MP
anil firojiya
daughter
PM Modi
smiles

More Telugu News