TRS: 'ఏమయ్యా.. చిన్న ఉద్యోగులపైనా మీ ప్రతాపం?' అంటూ మండిపడిన కాంగ్రెస్

ballampally municipal commissioner issues memos to 3 employees to not attend ktr birth day celebrations
  • బెల్లంపల్లి మునిసిపల్ కౌన్సిల్ ముగ్గురు ఉద్యోగులకు జారీ చేసిన మెమోను పోస్ట్ చేసిన కాంగ్రెస్  
  • పుట్టిన రోజు జరపద్దని ముందే చెప్పిన కేటీఆర్ ఏతులకు పొయ్యిండు? అంటూ కాంగ్రెస్ ప్రశ్న 
  • అంతా డ్రామానా? అంటూ నిలదీత   
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. మంత్రి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదంటూ బెల్లంపల్లి మునిసిపల్ కౌన్సిల్ ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిందంటూ, ఆ మెమోను కూడా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. 'అష్టకష్టాలలో వున్న ప్రజలను ఇబ్బంది పెట్టదలచుకోలేదని చెబుతూ తన పుట్టిన రోజు జరపద్దని ముందే చెప్పిన కేటీఆర్ ఏతులకు పొయ్యిండు? అంతా డ్రామానా?' అంటూ కాంగ్రెస్ నిలదీసింది. 'ఏమయ్యా..చిన్న ఉద్యోగులపైనా మీ ప్రతాపం? ఒక అవినీతిపరుడి పుట్టిన రోజు ఏమన్నా పర్వదినమా తెలంగాణా ప్రజలకు?' అంటూ తన ట్వీట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.        

TRS
KTR
Telangana
Mancherial District
Bellampally
Memo

More Telugu News