Parthasathi Reddy: టీఆర్ఎస్ ఎంపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హెటిరో బాధిత సంఘం

  • హెటిరో పార్థసారథిరెడ్డిపై ఫిర్యాదు చేసిన బాధితులు
  • ఆయనపై ఉన్న కేసులను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఫిర్యాదు
  • రాజ్యసభ సభ సభ్యత్వంపై వేటు వేయాలని విన్నపం
Complaint against TRS MP Parthasarathi Reddy

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు పార్థసారథి రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి హెటిరో బాధిత సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పార్థసారథి రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఉన్న క్రిమినల్ కేసు, బ్లాక్ మనీ కేసులను అఫిడవిట్ లో పేర్కొనలేదని చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చిన పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యత్వంపై వేటు వేయాలని కోరారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదని తెలిపారు. 

పార్థసారథి రెడ్డి అంశానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్తామని... సీబీఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంతమ్మగూడెంలో పార్థసారథిరెడ్డికి చెందిన హెటిరో డ్రగ్స్ కంపెనీ వల్ల 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ గురించి పొల్యూషన్  కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్థసారథిరెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు.

More Telugu News