రైళ్లలో వృద్ధులకు త్వరలో రాయితీ పునరుద్ధరణ... కొత్త షరతులు ఇవే
- కరోనా నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు నిలిచిన రాయితీ
- త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన కేంద్రం
- వయో పరిమితి 58 నుంచి 70 ఏళ్లకు పెంపు
- జనరల్, స్లీపర్ క్లాసులకు మాత్రమే పరిమితం కానున్న రాయితీ
కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పునరుద్ధరించనున్న రాయితీ 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు మాత్రమే అందనుంది. గతంలో ఈ వయో పరిమితి 58 ఏళ్లుగా ఉండేది. అంతేకాకుండా త్వరలోనే అందుబాటులోకి రానున్న రాయితీ ప్రయాణం జనరల్, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే వర్తించనుంది.