Pawan Kalyan: పత్రీజీ కుటుంబ సభ్యులకు, ఆయన శిష్య బృందానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా: పవన్ కల్యాణ్

Pawan Kalyan pays condolences to Subhash Patriji
  • ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కన్నుమూత
  • ధ్యానం విలువను అందరికీ చేర్చారన్న పవన్
  • గతంలో పత్రీజీతో మాట్లాడానన్న పవన్ 
ప్రముఖ ధ్యాన ప్రక్రియ గురువు సుభాష్ పత్రీజీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పత్రీజీ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యానం విలువను, అవసరాన్ని అందరికీ చేర్చడంలో గురువుగా ఆయన తన వంతు బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించారని చెప్పారు. 

తాను చిత్ర పరిశ్రమలోకి రాక ముందు సుభాష్ పత్రీజీతో ధ్యానం, సంబంధిత అంశాలపై సంభాషించి, కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. శివైక్యం చెందిన పత్రీజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన శిష్య బృందానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.
Pawan Kalyan
Janasena
Subhash Patriji

More Telugu News