Gwalior: ఇంటికి రూ. 3,419 కోట్ల కరెంట్ బిల్లు.. షాక్ తో అస్వస్థతకు గురైన వ్యక్తి!

  • గ్వాలియర్ లో ఒక ఇంటికి షాకిచ్చిన విద్యుత్ శాఖ
  • బాధితుల ఫిర్యాదుతో పొరపాటును సరిదిద్దుకున్న అధికారులు
  • బాధితులకు రూ. 1,300 బిల్లు ఇచ్చిన వైనం
Gwalior family gets Rs 3419 Cr electricity bill

ఒక్కోసారి విద్యుత్ శాఖ చేసే పొరపాట్లు ఎంతో మందికి షాకిస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ కూడా ఓ కుటుంబానికి అలాగే షాకిచ్చింది. గ్వాలియర్ నగరంలోని శివ్ విహార్ కాలనీలో ఉన్న ఒక ఇంటికి ఏకంగా రూ. 3,419 కోట్ల బిల్లు వచ్చింది. ప్రియాంక గుప్తా పేరిట ఆ ఇల్లు ఉంది. 

ఈ బిల్లును చూసిన ఆమె మామ (భర్త తండ్రి) షాక్ కు గురై, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేల కోట్ల రూపాయల బిల్లును చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు. ఈ విషయాన్ని ప్రియాంక, సంజీవ్ లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పును సరిదిద్దుకున్న అధికారులు రూ. 3,419 కోట్ల బిల్లును వెనక్కి తీసుకుని, రూ. 1,300 వాస్తవ బిల్లును అందించారు.

More Telugu News