Tollywood: లండ‌న్‌లో షాపింగ్ ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే

pooja hegdes photo in london shopping goes viral on social media
  • లండ‌న్ టూర్‌లో పూజ హెగ్డే
  • ఫుట్‌వేర్ షాప్‌లో నింపాదిగా సెల్ఫీ తీసుకున్న న‌టి
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటో
ద‌క్షిణాది భాషా చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న పూజ హెగ్డే ప్ర‌స్తుతం లండ‌న్ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. సినిమా షూటింగ్‌ల మ‌ధ్య‌లో కాస్తంత గ్యాప్ దొరికిన నేప‌థ్యంలో లండ‌న్‌లో షాపింగ్ చేస్తున్న పూజ... మంగ‌ళ‌వారం రాత్రి త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. రిటెయిల్ థెర‌పీ ఎంజాయ్ చేస్తున్న‌ట్లుగా స‌ద‌రు పోస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చింది. 

లండ‌న్‌లోని ఓ ఫుట్‌వేర్ షాప్‌లో నింపాదిగా కూర్చున్న పూజ ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీకి సంబంధించిన ఫొటోనే ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన నెటిజ‌న్స్ పూజపై ప‌లు ర‌కాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియాలో చేరిన నిమిషాల వ్యవ‌ధిలోనే ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారిపోయింది.
Tollywood
Pooja Hegde
Social Media
London
Footwear Shop
Retail Therapy

More Telugu News