YSRCP: వ‌ర‌ద బాధితుల చేతుల్లో 'జ‌గ‌న‌న్న దేవుడు' ప్ల‌కార్డు.. వీడియో ఇదిగో

flood affected people shows playcard that says jagananna devudu
  • కోన‌సీమ జిల్లాలో పర్య‌టించిన జ‌గ‌న్‌
  • జ‌గ‌న‌న్న దేవుడు అంటూ ప్ల‌కార్డును ప‌ట్టిన వ‌ర‌ద బాధితులు
  • వీడియోను పోస్ట్ చేసిన వైసీపీ
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. జ‌గ‌న‌న్న దేవుడు అంటూ రాసి ఉన్న ఓ ప్లకార్డును వ‌ర‌ద బాధితులు త‌మ చేతుల్లో ప‌ట్టుకుని చూపించారు. అంతేకాకుండా జ‌గ‌న్ సీఎంగా ఉండ‌గా తాము అదృష్ట‌వంతులం అంటూ ఓ వీడి‌యో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. వైసీపీ అధికారిక ట్విట్ట‌ర్‌లో ఈ వీడియో క‌నిపించింది.

రెండు వారాలుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఏపీలోని ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌రిశీల‌న కోసం మంగ‌ళ‌వారం అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోని పి.గ‌న్న‌వ‌రం, రాజోలు మండ‌లాల్లో ముఖ్యమంత్రి ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే వ‌ర‌ద బాధితులు ప్ల‌కార్డును ప్ర‌ద‌ర్శించారు.
YSRCP
YS Jagan
Dr BR Ambedkar Konaseema District
Floods

More Telugu News