Raviteja: 'రామారావు' డైరెక్టర్ కి అలా ఛాన్స్ వచ్చిందట!

  • 'రామారావు ఆన్  డ్యూటీ' దర్శకుడిగా శరత్
  • రచయితగా .. దర్శకుడిగా అనుభవం
  • సినిమాటోగ్రఫీలోను ప్రవేశం 
  • ఈ నెల 29న రిలీజ్ అవుతున్న సినిమా
Ramarao On Duty movie update

రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను శరత్ మండవ రూపొందించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. శరత్ ఈ సినిమాతోనే దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. అయితే ఇప్పుడు ఇతను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినవాడేమీ కాదు. 

సినిమాల పట్ల గల ప్యాషన్ తో సాఫ్ట్ వేర్ సైడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు. కమల్ నిర్మాణ సంస్థలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. 'బిల్లా 2' వంటి సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే అందించాడు. తమిళంలో ఆ మధ్య వచ్చిన 'కో 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ గా కూడా అనుభవం ఉంది.

ఇండస్ట్రీకి రాకముందు నుంచే సుధాకర్ చెరుకూరితో శరత్ కి మంచి స్నేహం ఉందట. ఆ స్నేహమే ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేయడానికి కారణమైంది. రచయితగా .. కెమెరామెన్ గా .. దర్శకుడిగా మంచి అనుభవమే ఉంది గనుక, ఇక ఈ సినిమాపై గట్టిగానే నమ్మకం పెట్టుకోవచ్చునేమో.

More Telugu News