Draupadi Murmu: రాష్ట్రపతి ముర్ముతో ప్ర‌తిభా పాటిల్ భేటీ!.. దేశ చ‌రిత్ర‌లో ఆ ఇద్ద‌రిది ఓ రికార్డు!

Pratibha Devisingh Patil met draupadi murmu at rashtrapati bhavan
  • భార‌త రాష్ట్రప‌తిగా ప‌నిచేసిన తొలి మ‌హిళ ప్ర‌తిభా పాటిల్‌
  • ఈ ప‌ద‌విని చేప‌ట్టిన రెండో మ‌హిళ‌గా ద్రౌప‌ది ముర్ము
  • రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ముర్మును క‌లిసిన పాటిల్‌
భార‌త రాష్ట్రప‌తి అధికారిక నివాసంలో మంగ‌ళ‌వారం ఇద్ద‌రు అరుదైన నేత‌ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. భార‌త రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి మ‌హిళ ప్ర‌తిభా దేవీసింగ్ పాటిల్‌, తాజాగా అదే ప‌ద‌విని చేప‌ట్టిన రెండో మ‌హిళ‌గా రికార్డుల‌కు ఎక్కిన ద్రౌప‌ది ముర్ముతో భేటీ అయ్యారు. త‌న కుమార్తెతో క‌లిసి మంగ‌ళ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన ప్ర‌తిభా పాటిల్‌... సోమ‌వారం భార‌త రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ద్రౌప‌ది ముర్మును క‌లిశారు. వెర‌సి ఒకే ఫ్రేమ్‌లో భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌వి చేప‌ట్టిన ఇద్ద‌రు మ‌హిళామ‌ణులు ఇలా క‌లిసి క‌నిపించారు. ఈ ఫొటోను రాష్ట్రప‌తి భ‌వ‌న్ కార్యాల‌యం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.
Draupadi Murmu
Pratibha Devisingh Patil
Pratibha Patil

More Telugu News