Corona Virus: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​కు మరోసారి కరోనా

Bihar CM Nitish Kumar Tests Positive for COVID second time
  • ఈ రోజు ఉదయం చేసిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు
  •  మూడు, నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నితీశ్
  • ఈ జనవరిలోనూ కరోనా బారిన పడ్డ బీహార్ ముఖ్యమంత్రి
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. మంగళవారం ఉదయం చేసిన పరీక్షల్లో ఆయనకు వైరస్ నిర్ధారణ అయింది. నితీశ్ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్ష చేయగా... పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నరని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మధ్య తనను కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని నితీశ్ కుమార్ సూచించారు. 

జ్వరం కారణంగా నితీశ్ కుమార్ గత కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కాగా, నితీశ్ కరోనా పాజిటివ్ గా తేలడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఆయనకు వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో అప్పుడు కూడా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి కోలుకున్నారు.
Corona Virus
Bihar
Nitish Kumar
positve
tests

More Telugu News