SBI: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 10 వేలకు మించి డ్రా చేయాలంటే.. మొబైల్ తప్పనిసరి!

  • రూ. 10వేల పైన విత్‌డ్రాలకు ఓటీపీ తప్పనిసరి
  • కార్డు పెట్టగానే బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌కు ఓటీపీ
  • మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులను కాపాడేందుకేనన్న ఎస్‌బీఐ
SBIs Rule Change For ATM Cash Withdrawal

స్టేట్‌బ్యాంకు ఏటీఎం నుంచి ఇకపై రూ. 10 వేలకు మించి డ్రా చేయాలంటే మొబైల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు స్టేట్‌బ్యాంకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులను కాపాడే లక్ష్యంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎం నుంచి రూ. 10 వేలను మామూలుగా తీసుకోవచ్చు.

ఆపై మాత్రం నగదు తీసుకోవాలంటే బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నొక్కగానే ఆ మొబైల్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. కాగా, ఇదే నిబంధనను ఇతర బ్యాంకులు కూడా అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News