Telangana: తెలంగాణ తెచ్చుకుంది ‘మెగా’ కోసమా?: వైఎస్ ష‌ర్మిల‌

  • కేసీఆర్‌, మెగా ఇద్దరూ తోడు దొంగలేనన్న షర్మిల 
  • కాళేశ్వరం మునిగితే కృష్ణారెడ్డిపై చ‌ర్య‌లేవంటూ ప్రశ్న 
  • 80 శాతం ప్రాజెక్టుల‌ను మెగాకే ఎందుకిస్తున్నార‌న్న ష‌ర్మిల‌
ysrtp chief ys sharmila fores on trs government over kaleswaram murged in floods

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌ల డోసును క్ర‌మంగా పెంచుతున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తాజాగా... మొన్న‌టి వ‌ర‌ద‌ల్లో మునిగిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంశాన్ని ఆధారం చేసుకుని సోమ‌వారం ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్ స‌ర్కారుకు, కాళేశ్వ‌రం నిర్మాణ కంపెనీ మెగాకు లోపాయికారీ ఒప్పందాలున్నాయ‌న్న కోణంలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ తెచ్చుకుంది ‘మెగా’ కోసమా? అంటూ ప్ర‌శ్నించిన ష‌ర్మిల‌.. కేసీఆర్, 'మెగా' కంపెనీ అధినేత కృష్ణారెడ్డి తోడు దొంగ‌ల‌ని దుయ్య‌బ‌ట్టారు.

రెండేండ్లకే కాళేశ్వరం మునిగితే మెగా కృష్ణారెడ్డిపై చర్యలేవి? అని ప్ర‌శ్నించిన ష‌ర్మిల‌.. 80 శాతం ప్రాజెక్టులు ‘మెగా’కే ఎందుకు ఇస్తున్నరు? అని నిల‌దీశారు. ఉద్యమంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు వద్దని, ఇప్పుడెందుకు ఆంధ్రా కాంట్రాక్టర్ అయిన కృష్ణారెడ్డికి తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నరని ప్ర‌శ్నించారు.

More Telugu News