Sudeep: రేపే 'విక్రాంత్ రోణ' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • సుదీప్ హీరోగా రూపొందిన 'విక్రాంత్ రోణ'
  • అనూప్ భండారి దర్శకత్వం వహించిన  సినిమా ఇది 
  • సంగీత దర్శకుడిగా అజనీశ్ లోక్ నాథ్ 
  • ఈ నెల 28వ తేదీన విడుదల
Vikranth Rona Movie Released

సుదీప్ కి కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను మంచి క్రేజ్ ఉంది. తెలుగులో 'ఈగ' సినిమా విలన్ గా ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. 'బాహుబలి' .. ' సైరా' సినిమాల్లోను ఆయన ముఖ్యమైన పాత్రలు చేశాడు. ఆయన హీరోగా కన్నడలో 'విక్రాంత్ రోణ' సినిమా రూపొందింది.

జాక్ మంజు - అలంకార పాండియన్ నిర్మించిన ఈ సినిమాకి, అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. నీతా అశోక్ .. జాక్విలిన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. 

ఈ ఈవెంట్ ను హైదరాబాదులోని 'పార్క్ హయత్' హోటల్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News