BJP: స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసిన కేంద్ర మంత్రి.. పానీ పూరీ ఎందుకు ప్ర‌త్యేక‌మో చెప్పిన హ‌ర్దీప్ సింగ్ పూరీ

  • వీధుల్లో తిరిగిన హ‌ర్దీప్ సింగ్ పూరీ
  • కాకా హొటల్ రుచుల‌ను ఆస్వాదించిన కేంద్ర మంత్రి
  • కూర‌గాయల దుకాణాల వ‌ద్ద క‌నిపించిన వైనం
uninon minister Hardeep Singh Puri tweet on street food

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. సెల‌వు దినం ఆదివారం ఆయ‌న ఓ న‌గ‌రంలో పానీ పూరీ బండ్లు, కూర‌గాయ‌ల దుకాణాలు, కాకా హోట‌ళ్ల‌లో లోకల్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. స్ట్రీట్ వెండ‌ర్స్ బండ్ల వ‌ద్ద నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చారు. 

ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ స్ట్రీట్ ఫుడ్ ప్ర‌త్యేక‌త‌ను, ప్ర‌త్యేకించి పానీ పూరీల ప్ర‌త్యేక‌త‌ను గురించి వివ‌రించారు. దేశంలోని ప్ర‌తి ప్రాంతంలోనూ పానీ పూరీ క‌నిపిస్తుంద‌ని, అయితే ఏ రెండు పానీ పూరీ బండ్ల వ‌ద్ద ఒకే రక‌మైన రుచి క‌నిపించ‌ద‌ని వెల్ల‌డించారు. ఒక్కొక్క‌రు ఒక్కో రుచితో పానీ పూరీని అందిస్తున్నార‌ని, అందుకే ఏ పానీ పూరీ బండి వ‌ద్ద‌కు వెళ్లినా అదో ప్ర‌త్యేక‌మైన రుచిగానే నిలుస్తోందని తెలిపారు.

More Telugu News