Congress: తెలంగాణ ఆర్థికంగా దిగజారిపోతోంది.. అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ముంచుతున్నారు: ఉత్తమ్

  • ఏటా రూ.50 వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి జనం నెత్తిన రుద్దుతున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్ చాలా సార్లు ప్రశ్నించినా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపాటు
  • టీఆర్ఎస్ అసమర్థత వల్ల రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి ఉందన్న ఉత్తమ్ 
MP Uttam kumar reddy fires on TRS Govt

టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల తెలంగాణ ఏటా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతున్నారని.. సీఎం కేసీఆర్ రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి సోమవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎంత చెప్పినా వినకుండా అప్పులు
ఎడాపెడా అప్పులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని.. కాసీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు. గత ఏడాది మార్చి నాటికి తెలంగాణ అప్పులు రూ.2.67 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.12 లక్షల కోట్లకు చేరిందని.. ఇలా ఏటా రూ.50 వేల కోట్ల వరకు అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో అంకెలను తారుమారు చేస్తోందని, తప్పుడు వివరాలు ఇస్తోందని కాగ్‌, 15వ ఆర్థిక సంఘం తమ నివేదికల్లో అనుమానం వ్యక్తం చేశాయని గుర్తు చేశారు.

More Telugu News