'ఈనాడు'లో అమిత్ షా వ్యాసం.. పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- గిరిజనుల అభ్యున్నతి కోసం బీజేపీ తీసుకున్న చర్యలపై వ్యాసం
- అటల్ మొదలు మోదీ సర్కారు చర్యల ప్రస్తావన
- క్లిప్పింగ్‌ను పంచుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ అమిత్ షా ఈ వ్యాసాన్ని రాసినట్లుగా తెలుస్తోంది. ఈనాడు ఎడిటోరియల్ పేజీలో అమిత్ షా రాసిన వ్యాసాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.