Junior NTR: కొరటాలతో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

  • ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాలతో
  • జూబ్లీహిల్స్ లో స్పెషల్ సెట్ రెడీ  
  • సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
Ntr in Koratala movie

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో గతంలో 'వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయనుండటంతో, సహజంగానే ఆ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా వేయబడిన సెట్లో ఫస్టు షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఎవరిని ఖరారు చేశారనేది అధికారికంగా తెలియవలసి ఉంది. ఈ సినిమాను 'సంక్రాంతి'కి రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ కొరటాలకి చాలా అవసరమనే సంగతి తెలిసిందే.

More Telugu News