కదలలేని స్థితిలో కైకాల... బెడ్‌పైనే బర్త్ డే కేక్ కట్ చేయించిన చిరు... ఫొటోలు ఇవిగో
- నేడు సత్యనారాయణ జన్మదినం
- చికిత్స పొందుతున్న కైకాల వద్దకెళ్లిన చిరు
- ఫొటోలను పోస్ట్ చేసిన మెగాస్టార్
ఈ సందర్భంగా కైకాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానని, అది తనకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని చిరు పేర్కొన్నారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కేక్ కట్ చేస్తున్న ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.