Chiranjeevi: క‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌... బెడ్‌పైనే బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేయించిన చిరు... ఫొటోలు ఇవిగో

megastar chiranjeevi birth day wishes to kaikala satyanarayana
  • నేడు స‌త్య‌నారాయ‌ణ జ‌న్మ‌దినం
  • చికిత్స పొందుతున్న కైకాల వ‌ద్ద‌కెళ్లిన చిరు
  • ఫొటోల‌ను పోస్ట్ చేసిన మెగాస్టార్‌
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల సత్య‌నారాయ‌ణ‌కు సోమ‌వారం మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వ‌య‌సు రీత్యా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కైకాల ప్ర‌స్తుతం బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్న ఆయ‌న వ‌ద్ద‌కు చిరు స్వ‌యంగా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌న వెంట బ‌ర్త్ డే కేక్ తీసుకెళ్లిన చిరు... బెడ్‌పై దానిని పెట్టి కైకాల‌ చేత క‌ట్ చేయించారు. 

ఈ సంద‌ర్భంగా కైకా‌ల‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాన‌ని, అది త‌న‌కు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని చిరు పేర్కొన్నారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా కైకాల సత్యనారాయణ కేక్ క‌ట్ చేస్తున్న ఫొటోల‌ను చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.
Chiranjeevi
Tollywood
Kaikala Satyanarayana
Birth Day

More Telugu News