Salman Khan: గాళ్ ఫ్రెండ్ బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసిన సల్మాన్ ఖాన్!

Salman Khan attends alleged girl friend Lulia Vanture bithday celebrations
  • ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్న సల్మాన్ ఖాన్
  • మోడల్ భామ లులియా వాంచూర్ తో సాన్నిహిత్యం
  • 42వ పుట్టినరోజు జరుపుకున్న లులియా
  • సల్మాన్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరైన వైనం
బాలీవుడ్ సూపర్ సార్ట్ సల్మాన్ ఖాన్ వయసు 56 ఏళ్లు. ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నాడు. గతంలో కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నప్పటికీ, అవి పెళ్లి వరకు వెళ్లలేదు. గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ పేరు విదేశీ మోడల్ భామ లులియా వాంచూర్ తో కలిపి వినిపిస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని అనేక కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇరువురు అనేక పర్యాయాలు జంటగా కనిపించారు.

తాజాగా, లులియా వాంచూర్ 42వ పుట్టినరోజును సల్మాన్ ఖాన్ ఘనంగా నిర్వహించినట్టు తెలిసింది. ఈ నెల 24న లులియా బర్త్ డే కాగా, ఈ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు దర్శనమిచ్చారు. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్, బావ ఆయుష్ శర్మ, దర్శకుడు సాజిద్ అలీ తదితరులు ఈ వేడుకల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను లులియా వాంచూర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.
.
Salman Khan
Lulia Vantur
Bithday
Celebrations
Bollywood

More Telugu News