Harish Rao: ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోసులు వేసేందుకు కార్యాచరణ రూపొందించండి: హరీశ్ రావు

  • రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్న మంత్రి 
  • సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
Harish Rao orders to prepare a plan to give booster doses

కరోనా బూస్టర్ డోసులపై అధికారులకు తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోసులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. 

ప్రజా ప్రతినిధులు కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు వారికి సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై సూచనలు చేశారు.

More Telugu News