Shreyas Iyer: అక్షర్ పటేల్ విన్నింగ్ షాట్ కొట్టాక డగౌట్ లో గంతులేసిన శ్రేయాస్ అయ్యర్... వీడియో ఇదిగో!

Shreyas Iyer dances in the dugout after Axar Patel winning shot in 2nd ODI
  • విండీస్ తో రెండో వన్డేలో భారత్ జయభేరి
  • చిచ్చరపిడుగులా చెలరేగిన అక్షర్ పటేల్
  • సిక్సర్ తో మ్యాచ్ ను ముగించిన వైనం
  • సిరీస్ 2-0తో టీమిండియా కైవసం
వెస్టిండీస్ తో రెండో వన్డేలో అక్షర్ పటేల్ ఓ సిక్స్ తో మ్యాచ్ ను ముగించగా, టీమిండియా మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. లోయరార్డర్ లో బరిలో దిగిన అక్షర్ పటేల్ కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు గిల్ 43, శ్రేయాస్ అయ్యర్ 63, సంజు శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులు చేశారు. 

కాగా, ఆట చివర్లో కైల్ మేయర్స్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ సిక్సర్ బాదగా, టీమిండియా డగౌట్ లో సంబరాలు మొదలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ గాల్లోకి ఊపుతూ గంతులేశాడు. డ్రెస్సింగ్ రూంలోనూ సందడి వాతావరణం నెలకొంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం అక్షర్ పటేల్ దగ్గరకు వచ్చి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
Shreyas Iyer
Axar Patel
Winning Shot
Dugout
2nd ODI
Team India
West Indies

More Telugu News