TS Film Chamber Of Commerce: లోబడ్జెట్‌కు 4 వారాలు, భారీ బ‌డ్జెట్‌కు 10వారాలు... ఓటీటీ రిలీజ్‌పై టాలీవుడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు

TS Film Chamber Of Commerce decides the gap betwenn theatre and ptt release of films
  • రూ.6 కోట్ల లోపు సినిమాల‌న్నీ లోబ‌డ్జెట్ సినిమాలు
  • రూ.6 కోట్లు మించిన‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ సినిమాలే
  • సినిమా టికెట్ల ధ‌ర‌ల‌నూ నిర్ణ‌యించిన ఫిలిం చాంబ‌ర్‌
తెలుగు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంపై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌ సోమ‌వారం ఓ స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌కటించింది. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్‌లో భేటీ అయిన ఫిలిం చాంబ‌ర్‌ కొత్త విధానాన్ని ప్ర‌క‌టించింది. అన్నిర‌కాల సినిమాల‌కు ఈ విషయంలో ఒకే త‌ర‌హా నిబంధన‌లు స‌రికాద‌ని భావించిన స‌మావేశం.. లో బ‌డ్జెట్ సినిమాల‌కు ఒక ర‌క‌మైన, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు మ‌రో ర‌క‌మైన నిబంధ‌న‌ల‌ను నిర్దేశించింది.

రూ.6 కోట్ల లోపు బ‌డ్జెట్‌తో రూపొందే సినిమాల‌ను లో బ‌డ్జెట్ సినిమాలుగా ప‌రిగ‌ణించిన స‌మావేశం... ఈ సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన త‌ర్వాత క‌నీసం 4 వారాల త‌ర్వాతే ఓటీటీలో విడుద‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రూ.6 కోట్ల‌కు పైబ‌డి బ‌డ్జెట్‌తో రూపొందే సినిమాల‌ను భారీ బ‌డ్జెట్ సినిమాలుగా ప‌రిగ‌ణించిన స‌మావేశం... ఈ త‌ర‌హా సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాక క‌నీసం 10 వారాల పాటు ఓటీటీలో విడుద‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌దని నిర్ణ‌యించింది. ఇదిలా ఉంటే... తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపైనా ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
TS Film Chamber Of Commerce
Telangana
Tollywood
OTT

More Telugu News