డబ్బుంటే ‘పవర్’ ఉన్నట్టు కాదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు
- మనీ అన్నది ఓ డేటాబేస్ అన్న మస్క్
- సేవలను ఇచ్చిపుచ్చుకునే వాహకంగా అభివర్ణన
- డబ్బుకు సొంతంగా శక్తి ఏమీ లేదని వ్యాఖ్య
డబ్బుకు సొంతంగా విలువ, శక్తి ఉండవనే విషయాన్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ‘‘ప్రజలు ఆర్థిక వ్యవస్థనే డబ్బుగా అయోమయానికి గురవుతుంటారు. మనీ అన్నది వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునే ఓ డేటాబేస్ అంతే. దానంతట అదే డబ్బుకి శక్తి లేదు. నిజమైన ఆర్థికం అంటే వస్తు, సేవలే’’ అన్నది మస్క్ అభిప్రాయం. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. డబ్బు అంటే లెక్కలేని వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఇలానే ఉంటాయని కొందరు విమర్శలు చేయగా, కొందరు సమర్థిస్తున్నారు.