Narendra Modi: సోనియా గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాల్సిందే: జైరాం రమేశ్

PM Nadda should apologise for BJP spokespersons remarks on Sonia Jairam Ramesh
  • న్యూస్‌ చానల్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న జైరాం రమేశ్
  • మరోసారి చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
  • బీజేపీ నేతలు తరచూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌శుక్లా అనుచిత వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ చానల్‌లో ప్రేమ్‌శుక్లా ఉపయోగించిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గౌరవంగా చూడాల్సిన మహిళలపై బీజేపీ నేతలు, అధికార ప్రతినిధులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా ఎదుర్కోక తప్పదని జైరాం రమేశ్ హెచ్చరించారు.
Narendra Modi
Sonia Gandhi
Jairam Ramesh
Congress

More Telugu News