Team India: విండీస్‌పై గెలుపుతో పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన టీమిండియా

India break Pakistans record of most consecutive ODI series win against a team
  • విండీస్‌పై వరుసగా 12వ సిరీస్‌లోనూ భారత్ విజయం
  • జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకున్న పాకిస్థాన్
  •  2007-2021 మధ్య శ్రీలంకపై 9 సిరీస్ వన్డే సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో గత రాత్రి జరిగిన రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌పై వరుసగా 12వ వన్డే సిరీస్‌లోనూ విజయం సాధించి పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. విండీస్‌పై వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకున్న భారత్.. పాక్ రికార్డును బద్దలుగొట్టింది.  

2007-2022 మధ్య విండీస్‌పై భారత్ వరుసగా 12 వన్డే సిరీస్‌లు సొంతం చేసుకోగా, 1996-2021 మధ్య జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుంది. మూడో స్థానంలోనూ పాకిస్థానే ఉంది. 1999-2022 మధ్య విండీస్‌పై వరుసగా 10 సిరీస్‌లను ‘మెన్ ఇన్ గ్రీన్’ గెలుచుకుంది. 1995-2018 మధ్య జింబాబ్వేపై దక్షిణాఫ్రికా 9, 2007-2021 మధ్య శ్రీలంకపై భారత్ 9 సిరీస్‌లలో విజయం సాధించింది.
Team India
Pakistan
West Indies
ODI Series

More Telugu News