బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడిపోయిన రిషి సునక్!
- నిన్నమొన్నటి వరకు రేసులో ముందంజలో సునక్
- వెనకబడిన విషయాన్ని స్వయంగా అంగీకరించిన రిషి
- విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్న కన్జర్వేటివ్ సభ్యులు
కాగా, బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వేలోనూ సునక్‌కు ఎదురుగాలి వీస్తున్నట్టు స్పష్టమైంది. 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్‌ను బలపరిచారు. రిషికి 38 శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. మొత్తం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఎటు మొగ్గితే వారు ప్రధాని అవుతారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 12 విడతలుగా ప్రధాని ఎన్నిక జరుగుతుంది.