Monkeypox Virus: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం

  • యూరప్ దేశాల్లో మొదలైన మంకీపాక్స్ వ్యాప్తి
  • భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు
  • ఇప్పటివరకు 4 పాజిటివ్ కేసులు నమోదు
  • ఇటీవల కువైట్ నుంచి కామారెడ్డి జిల్లాకు వచ్చిన వ్యక్తి
  • పరిశీలనలో ఉంచిన వైద్యులు
Monkeypox rage in Kamareddy district

యూరప్ దేశాల్లో మొదలైన మంకీపాక్స్ కలకలం ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. 

ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు. తాజాగా, అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.

More Telugu News