YS Sharmila: త్వరగా కోలుకోవాలంటూనే... కేటీఆర్ కు సెటైర్ వేసిన షర్మిల!

Sharmila satire to KTR
  • ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డ కేటీఆర్
  • ఓటీటీలో మంచి షోలు ఉంటే సూచించాలన్న కేటీఆర్
  • కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బరస్ట్ తదితర పేర్లు చెప్పిన షర్మిల
తెలంగాణ మంత్రి కేటీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో ప్రమాదవశాత్తు ఆయన కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలు చీలమండకు దెబ్బ తగిలింది. చీలమండ లిగమెంట్ దెబ్బతిన్నదని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ఆయన తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాలక్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి షోలు ఉంటే సూచించాలని అడిగారు. 

కేటీఆర్ చేసిన ట్వీట్ కు వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రిప్లై ఇచ్చారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పాలన్న ఆయనకు సెటైర్ వేశారు. 'మీ ఆనందం కోసం చూడటానికి షోలు: కుట్ర సిద్ధాంతం - క్లౌడ్ బరస్ట్ - నీట మునిగిన గృహాలు మరియు పంప్ హౌస్ లు' అని ఎద్దేవా చేశారు.
YS Sharmila
YSRTP
KTR
TRS

More Telugu News