Devineni Uma: దుర్గమ్మ దయతోనే ప్రమాదం నుంచి బయటపడ్డా: దేవినేని ఉమ

Devineni Umamaheswara Rao visits vijayawada durgamma
  • వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా పడవ ప్రమాదం
  • సురక్షితంగా బయటపడిన టీడీపీ సీనియర్ నేత
  • పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలో  ప్రార్థనలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటపడినట్టు చెప్పారు. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన పడవ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడ దుర్గగుడి,  గొల్లపూడి దర్గాలో, మైలవరం, నూజివీడు విఘ్నేశ్వరస్వామి ఆలయంలో, బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజాసేవకే అంకితం చేస్తానని ఉమ అన్నారు.
Devineni Uma
Telugudesam
Vijayawada

More Telugu News