Shikhar Dhawan: వెస్టిండీస్ పై ధావన్ సెంచరీ మిస్... టీమిండియా భారీ స్కోరు

Dhawan missed century as Team India posted 300 plus total against host West Indies
  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో తొలి వన్డే
  • టీమిండియా వర్సెస్ వెస్టిండీస్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
  • రాణించిన గిల్, అయ్యర్
వెస్టిండీస్ తో తొలి వన్డేలో టీమిండియా సారథి శిఖర్ ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 97 పరుగులు చేసిన ధావన్ విండీస్ స్పిన్నర్ మోతీ బౌలింగ్ లో అవుటయ్యాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. 

ధావన్, శుభ్ మాన్ గిల్ జోడీ తొలి వికెట్ కు 119 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 97 పరుగులు చేయగా... గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా అర్ధసెంచరీ నమోదు చేశాడు. అయ్యర్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేశాడు. 

అయితే సూర్యకుమార్ యాదవ్ (13), సంజు శాంసన్ (12) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత్ స్కోరువేగం మందగించింది. చివర్లో అక్షర్ పటేల్ (21), దీపక్ హుడా (27) ఓ మోస్తరుగా ఆడారు. విండీస్ బౌలర్లలో మోతీ 2, అల్జారీ జోసెఫ్ 2, రొమారియో షెపర్డ్ 1, అకీల్ హోసీన్ 1 వికెట్ తీశారు.
Shikhar Dhawan
Team India
West Indies
1st ODI

More Telugu News