Telangana: తెలంగాణలో తాజాగా 739 కరోనా కేసులు

- గత 24 గంటల్లో 32,808 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 377 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 662 మంది
- ఇంకా 4,686 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,808 శాంపిల్స్ పరీక్షించగా, 739 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా హైదరాబాదులో 377 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 53, మంచిర్యాల జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 24, పెద్దపల్లి జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అదే సమయంలో 662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,13,120 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,04,323 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,686 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

