National Flag: ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi calls national flag should hoist on every house on August 13th and 14th
  • 1947 జులై 22న త్రివర్ణ పతాకానికి ఆమోదం
  • నాటి స్ఫూర్తిని స్మరించుకున్న ప్రధాని మోదీ
  • 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపు
భారత త్రివర్ణ పతాకాన్ని 1947 జులై 22వ తేదీన ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణ ద్వారా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమం మరింత పెంపొందిస్తుందని మోదీ పేర్కొన్నారు. 

వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాకం రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఆయన స్మరించుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు.
National Flag
Hoist
Narendra Modi
Har Ghar Tiranga
India

More Telugu News