EV fire: ఈవీ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలపై కంపెనీలకు షోకాజు నోటీసులు

EV fire incidents Centre serves notice to manufacturers
  • చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ కంపెనీలకు నోటీసులు  
  • కంపెనీలు స్పందించాల్సి ఉందన్న మంత్రి నితిన్ గడ్కరీ
  • ప్రభుత్వ ప్యానెల్ సిఫారసుల ఆధారంగా చర్యలు
ఎలక్ట్రిక్ స్కూటర్లలో (ఈవీ) అగ్ని ప్రమాదాలు జరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగిన వాహన కంపెనీలు అన్నింటికీ షోకాజు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని లోక్ సభలో వెల్లడించారు. తమ నోటీసులకు కంపెనీలు స్పందించాల్సి ఉంటుందన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఇటీవలి ఈవీ స్కూటర్లలో ప్రమాదాలపై ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఓ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్రం షోకాజు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. బ్యాటరీ తయారీలో లోపాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకున్నందున చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదు? అన్న దానిపై స్పందించాలని కోరింది. అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించిన ప్యానెల్ భద్రతా ప్రమాణాల కోసం తీసుకోవాల్సిన చర్యలను సైతం సిఫారసు చేసింది.
EV fire
scooters
Centre
notices

More Telugu News