India: డోక్లామ్ వద్ద చైనా నూతన నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం స్పందన

  • సరిహద్దుల సమీపంలో చైనా గ్రామాలు
  • సైనిక దళాలను వేగంగా తరలించేందుకు రోడ్ల నిర్మాణం
  • అన్ని పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్న బాగ్చి
India responds to China constructions at Doklam

డోక్లామ్ పీఠభూమి వద్ద సరిహద్దులకు సమీపంలో చైనా ఇటీవలే రెండో గ్రామం నిర్మాణం పూర్తి చేసి, కొత్త రోడ్లు వేస్తున్న దృశ్యాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడయ్యాయి. దీనిపై కేంద్రం స్పందించింది. చైనా వ్యవహరిస్తున్న తీరును కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు. భారతదేశ భద్రతను ప్రభావితం చేసే అన్ని పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా వేసి ఉంచుతుందని తెలిపారు. దేశ రక్షణ కోసం ఏంచేయాలో అన్నీ చేస్తుందని స్పష్టం చేశారు. 

ఇటీవలే జాతీయ మీడియాలో వచ్చిన కథనాలలో కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలు కనిపించాయి. అందులో చైనా నిర్మించిన నూతన గ్రామం దృశ్యాలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ఆ కృత్రిమ గ్రామంలో ప్రతి ఇంటి వద్ద ఓ కారు పార్క్ చేసి ఉండడం చూస్తుంటే, గ్రామంలో కార్యకలాపాలు కూడా సాగుతున్నాయని అర్థమవుతోంది. 'పంగ్డా'ల పేరిట చైనా సరిహద్దులకు సమీపంలో ఈ గ్రామాలను నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు గ్రామాలు నిర్మాణం జరుపుకోగా, మూడో గ్రామం నిర్మాణానికి డ్రాగన్ సన్నద్ధమవుతోంది.

More Telugu News