ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ప్రభుత్వంలో చలనం లేదు: బుద్ధా వెంకన్న
- వరద ముంపునకు గురైన వందలాది గ్రామాలు
- ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు
- ముంపు ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన
- విజన్ ఉన్న నాయకుడీకీ, లేనోడికీ తేడా అదేనన్న వెంకన్న
ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ఈ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శించారు. వరదలొస్తాయి అని వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించిందని, కానీ మునిగిపోయి నష్టం జరిగేదాకా ఈ ప్రభుత్వం చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉందని ఆరోపించారు. విజన్ ఉన్న నాయకుడికి, లేనోడికీ తేడా అదేనని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.