Buddha Venkanna: ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ప్రభుత్వంలో చలనం లేదు: బుద్ధా వెంకన్న

  • వరద ముంపునకు గురైన వందలాది గ్రామాలు
  • ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు
  • ముంపు ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన
  • విజన్ ఉన్న నాయకుడీకీ, లేనోడికీ తేడా అదేనన్న వెంకన్న
Buddha Venkanna slams YCP Govt over Godavari floods

ఇటీవల గోదావరి వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం ప్రాంతాల్లో ఆయన బాధితులను కలుసుకోనున్నారు. ఈ మధ్యాహ్నం నాగుల్లంక నుంచి ఆయన పర్యటన షురూ కానుంది. 

ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ఈ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శించారు. వరదలొస్తాయి అని వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించిందని, కానీ మునిగిపోయి నష్టం జరిగేదాకా ఈ ప్రభుత్వం చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉందని ఆరోపించారు. విజన్ ఉన్న నాయకుడికి, లేనోడికీ తేడా అదేనని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

More Telugu News