RX100: యమహా బైక్ ప్రేమికులకు శుభవార్త... మార్కెట్లోకి మళ్లీ వస్తున్న 'ఆర్ఎక్స్100'

  • గతంలో బైక్ ప్రియులను అలరించిన ఆర్ఎక్స్100
  • యమహా-ఎస్కార్ట్స్ గ్రూప్ భాగస్వామ్యంలో తయారీ
  • 1996 నుంచి నిలిచిన ఉత్పత్తి
  • ఇతర బైక్ ల వైపు మళ్లిన కుర్రకారు
  • ఆధునిక హంగులతో తాజాగా వస్తున్న ఆర్ఎక్స్100
Yamaha RX100 returns to Indian market

కొన్ని దశాబ్దాలుగా యువతను అలరిస్తున్న బైక్ లలో ఆర్ఎక్స్100 ఒకటి. దీని తయారీదారు జపాన్ కు చెందిన యమహా కంపెనీ. ఎంతో స్టయిలిష్ లుక్ తో ఉండే ఈ బైక్ ను కాలేజీ కుర్రకారు అమితంగా ఇష్టపడేది. అయితే, గత కొన్నాళ్లుగా ఈ బైక్ ఉత్పాదనను కంపెనీ నిలిపివేసింది. యమహా-ఎస్కార్ట్స్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్ ను 1996 వరకు కొనసాగించారు. తదనంతర కాలంలో ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో కుర్రకారు ఇతర బైక్ ల వైపు మళ్లారు. 

ఈ నేపథ్యంలో యమహా కంపెనీ ఆర్ఎక్స్100 ప్రేమికులకు శుభవార్త చెప్పింది. ఈ బైక్ ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సరికొత్త రూపులో ఆర్ఎక్స్100ను తీసుకువస్తున్నట్టు యమహా మోటార్ ఇండియా విభాగం చైర్మన్ ఇషిన్ చిహానా వెల్లడించారు. అయితే, గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ ఇప్పటి ఉద్గారాల ప్రమాణాల నిబంధనల వల్ల ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.

More Telugu News