KTR: ఇలాంటి ప్రధానిని మీరు ఏమని పిలుస్తారు?: కేటీఆర్

What do you call a PM who can Neither control Inflation in the country Nor Infiltration asks KTR
  • ఇటీవలి కాలంలో ప్రధానిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న కేటీఆర్
  • ద్రవ్యోల్బణం, చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించిన కేటీఆర్
  • నాలుగు ఆప్షన్లను కూడా ఇచ్చిన వైనం
ఇటీవలి కాలంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని మీరు ఏమంటారని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు ఈ ప్రశ్నకు ఆయన నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. 

ఏ) 56 ఇంచులు
బి) విశ్వగురు
సి) అచ్చే దిన్ వాలే
డి) పైన పేర్కొన్నవన్నీ అన్ పార్లమెంటరీ పదాలు... అందువల్ల తొలగించబడ్డాయి. 
పై ఆప్షన్లను కేటీఆర్ ఇచ్చారు. 

అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో చైనా నిర్మించిన రెండో గ్రామం, శాటిలైట్ ఇమేజెస్ కు సంబంధించి జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను కూడా కేటీఆర్ షేర్ చేశారు.
KTR
TRS
Narendra Modi
BJP

More Telugu News