Telangana: ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష‌ను మార్చాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్‌... కార‌ణం కూడా చెప్పిన బీఎస్పీ నేత‌

  • ఆగ‌స్టు 7న తెలంగాణ ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష‌
  • అదే రోజున సీఏపీఎఫ్ అసిస్టెంట్ క‌మాండెంట్‌, బ్యాంకు ప‌రీక్ష‌లు
  • తెలంగాణ‌కు చెందిన నిరుద్యోగులు వీటికి హాజ‌ర‌వుతున్నార‌న్న ప్ర‌వీణ్‌
bsp telengana chief rs praveen urges government chande the si exam

తెలంగాణలో కొన‌సాగుతున్న ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా పోలీసు శాఖ‌లో ఎస్సై పోస్టుల భ‌ర్తీకి కూడా నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఆగ‌స్టు 7న రాత ప‌రీక్ష నిర్వహించ‌నున్న‌ట్లు తెలంగాణ స్టేట్ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్బీ) ప్ర‌కటించింది. ఈ తేదీని మార్చాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి మంగళ‌వారం విజ్ఞ‌ప్తి చేశారు.

ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష తేదీని మార్చాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా చెబుతూ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఆగ‌స్టు 7న సీఏపీఎఫ్ అసిస్టెంట్ క‌మాండెంట్ ప‌రీక్ష‌తో పాటు బ్యాంకు ఉద్యోగాల భ‌ర్తీకి దేశ‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌కు చెందిన నిరుద్యోగులు హాజ‌ర‌వుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News