Vijay Devarakonda: ఈ నెల 21న 'లైగర్' ట్రైలర్ రిలీజ్!

  • 'లైగర్' గా విజయ్ దేవరకొండ 
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • హీరోయిన్ గా అనన్య పాండే పరిచయం 
  • ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల  
Liger movie updare

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. పూరి .. చార్మీ .. కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో పూరి ఎక్కువ సమయం తీసుకున్నాడు. కరోనా ప్రభావం కారణంగా మరింత ఆలస్యమైంది. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా అనన్య పాండే పరిచయం కానుంది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడాని కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్టు రోల్ లో కనిపించనున్నాడు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, మకరంద్ దేశ్ పాండే .. రోనిత్ రాయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విజయం విజయ్ దేవరకొండకి కీలకం కానుంది.

More Telugu News