విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ శ్రీను వైట్ల భార్య
- స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు వెలుగు వెలిగిన శ్రీను వైట్ల
- ఫ్యాషన్ డిజైనర్ రూపను ప్రేమించి పెళ్లాడిన శ్రీను
- కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న విభేదాలు
మరోవైపు శ్రీను వైట్ల వైవాహిక జీవితం కూడా సవ్యంగా లేదని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ ఆయన భార్య రూప కోర్టు మెట్లెక్కినట్టు తాజా సమాచారం. రూపను శ్రీను వైట్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రూప కూడా చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు నడుస్తున్నాయట.
ఈ క్రమంలో, మ్యూచువల్ డైవోర్స్ కుదరకపోవడంతో... ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కినట్టు చెబుతున్నారు. కుటుంబ సమస్యల వల్ల తన కెరీర్ పై శ్రీను వైట్ల ఫోకస్ చేయలేకపోతున్నారని అంటున్నారు.