Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా

Margaret Alva as opposition parties vice presidential candidate
  • శరద్ పవార్ నివాసంలో విపక్ష నేతల సమావేశం
  • ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ
  • మార్గరెట్ అల్వా పేరు ప్రకటించిన శరద్ పవార్
  • గతంలో 4 రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన ఆల్వా
ఆగస్టు 6న జరిగే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే ఇప్పటికే జగ్ దీప్ ధ‌న్‌ఖడ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విపక్షాలు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాయి. సీనియర్ నేత మార్గరెట్ ఆల్వాను తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దించాయి. 

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్ష నేతలు ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం మార్గరెట్ ఆల్వా పేరును శరద్ పవార్ ప్రకటించారు. మార్గరెట్ ఆల్వా కర్ణాటకకు చెందిన మహిళా కాంగ్రెస్ నేత. ఆమె గతంలో గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. మార్గరెట్ ఆల్వా గతంలో ఉత్తర కన్నడ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1984-89 మధ్య కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.
Margaret Alva
Vice President
Candidate
Opposition
Congress
Karnataka
India

More Telugu News