Andhra Pradesh: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. రెండుమూడు నెలల్లో మూడు రాజధానుల బిల్లు: మంత్రి గుడివాడ అమరనాథ్

three capitals bill will be kept in assembly says minister amarnath
  • విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామన్న మంత్రి
  • పశ్చిమ ఆస్ట్రేలియా బృందం పెట్టుబడుల కోసం విశాఖను పరిశీలించిందని వెల్లడి
  • నగరంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామన్న అమర్‌నాథ్
మూడు రాజధానులపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మరో రెండుమూడు నెలల్లో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని అన్నారు. విశాఖ ఛాంబర్ ఆఫ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిన్న నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ ఆస్ట్రేలియా బృందం మన దేశంలో పెట్టుబడుల కోసం బెంగళూరు, చెన్నై, విశాఖపట్టణం నగరాలనే ఎంచుకుందన్నారు. విశాఖలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రూ. 72 కోట్ల రాయితీలు పెండింగులో ఉన్నాయని, వాటిలో మూడోవంతు మొత్తాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తామన్నారు. అందుకు ముుఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు.
Andhra Pradesh
Amaravati
Gudivada Amarnath
Visakhapatnam

More Telugu News