Rithu Chowdary: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లి తెర బ్యూటీ రీతు చౌదరి

Actress Rithu Chowdary introduces her fiance
  • జబర్దస్త్ తో పాటు పలు సీరియల్స్ లో ఆకట్టుకున్న రీతు
  • శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి
  • తన ఫియాన్సీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రీతు
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతు చౌదరి... పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో ఆమె ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకులను కట్టిపడేసే నవ్వు ఆమె సొంతం. 

ఇప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు పరిచయం చేసింది. ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. రీతు చౌదరికి కాబోయే భర్త పేరు శ్రీకాంత్. తన ఫియాన్సీ ఫొటోలను షేర్ చేసిన రీతు.. తమ బంధం కంటే ఏదీ బెటర్ కాదని క్యాప్షన్ పెట్టింది. మరోవైపు నెటిజన్లు ఆమెకు బెస్ట్ విషెస్ చెపుతున్నారు.
Rithu Chowdary
Jabardasth
Fiance

More Telugu News