England: ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన

England braces for 40C temperatures as experts warn thousands could die
  • ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ప్రమాద సంకేతమన్న వాతావరణశాఖ
  • ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందంటున్న అధికారులు
  • అత్యవసర పనులను సైతం వాయిదా వేసుకోవాలని సూచన
ఇంగ్లండ్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా వడగాలులు వీస్తుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. దేశంలో తొలిసారి ఎండల కారణంగా ‘రెడ్‌ వార్నింగ్’ జారీ చేసింది. లండన్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ప్రమాదమని పేర్కొంటూ ‘అత్యయిక స్థితి’ని ప్రకటించింది. ప్రజలు ఎండలకు దూరంగా ఉండాలని, ప్రజలు ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు బయటకు రాకుండా చూసుకోవాలని, అత్యవసర పనులను సైతం వీలైతే వాయిదా వేసుకోవాలని పేర్కొంది.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడ వచ్చని తెలిపింది. మరోవైపు, బ్రిటన్ హెల్త్ ఏజెన్సీ కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది. తాజా పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది.
England
Temperatures
Level 4 Heat Alert
Summer

More Telugu News