YSRCP: పార్టీని న‌మ్ముకుంటే అప్పుల పాలు చేశారు... మంత్రి రోజా ముందు వైసీపీ నేత నిర‌స‌న‌

ysrcp village level leaders agitation before minister rk roja
  • బుట్టిరెడ్డి కండ్రిగ‌లో ఘ‌ట‌న‌
  • భార్య‌తో క‌లిసి మంత్రి రోజా ముందు నిర‌స‌న‌
  • రోడ్డు ప‌నుల బిల్లులు విడుద‌ల కాలేద‌ని ఆవేద‌న‌
 ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేప‌ట్టిన 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు నిరసన సెగ తగిలింది. చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలోని వ‌డ‌మాల‌పేట మండ‌లం బుట్టిరెడ్డి కండ్రిగ‌లో మంత్రి రోజా ముందే గ్రామ స్థాయి వైసీపీ నేత తీవ్ర నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. 

రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో చేస్తే త‌మ‌కు ఇప్ప‌టిదాకా బిల్లులే మంజూరు కాలేద‌ని గ్రామ మాజీ స‌ర్పంచ్ త‌న భార్యతో క‌లిసి రోజా ముందు నిర‌స‌న‌కు దిగారు. వైసీపీని న‌మ్ముకుని తాము అప్పుల్లో కూరుకుపోయామ‌ని తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేసిన‌ ఆ నేత మంత్రి ఎదుటే నిర‌స‌న‌కు దిగారు.
YSRCP
Roja
Nagari
Agitation
Chittoor District

More Telugu News