Sri Lanka: గొటబాయ రాజీనామాతో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న శ్రీలంక ప్రజలు.. వీడియో ఇదిగో

Sri Lankans hit the streets in celebration as President Gotabaya resigns
  • నిరసన జ్వాలలకు భయపడి మాల్దీవులకు పారిపోయిన గొటబాయ
  • అక్కడి నుంచి నిన్న సింగపూర్‌కు
  • అక్కడికి వెళ్లాక రాజీనామా పంపిన గొటబాయ రాజపక్స
  • కర్ఫ్యూను ధిక్కరించి మరీ సంబరాలు చేసుకున్న శ్రీలంక వాసులు
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన విషయం తెలిసిన శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. సంగీతం, డ్యాన్సులతో శ్రీలంక వీధుల్లో నిన్న కోలాహలం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమల్లో ఉన్న కర్ఫ్యూను ధిక్కరించి మరీ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 'గొటా గో గామా' నిరసన ప్రదేశంలో గొటబాయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మెరుగైన పాలన కావాలని మరికొందరు నినాదాలతో హోరెత్తించారు. 

తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, అధ్యక్ష భవనాన్ని ప్రజలు ముట్టడించడంతో గొటబాయ గత వారం అధ్యక్ష భవనాన్ని విడిచి పరారయ్యారు. మొన్న మాల్దీవులకు పారిపోయిన ఆయన నిన్న సాయంత్రం అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. మరోవైపు, అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలను గతవారం ముట్టడించిన నిరసనకారులు నిన్న సాయంత్రం వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు.  

Sri Lanka
Gotabaya Rajapaksa
Celebrations

More Telugu News