Team India: లార్డ్స్ స్టాండ్స్‌లో వీక్ష‌కుడిగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌

sachin tendulkar enjoys tem india match at lords stadium
  • లార్డ్స్‌లో రెండో వ‌న్డే ఆడుతున్న టీమిండియా
  • ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్ చూసేందుకు లండ‌న్ వెళ్లిన స‌చిన్‌
  • గంగూలీతో క‌లిసి స్టాండ్స్‌లో క‌నిపించిన మాజీ క్రికెట‌ర్‌
క్రికెట్ దిగ్గ‌జం, టీమిండియా మాజీ ఆట‌గాడు, భార‌త‌ర‌త్న స‌చిన్ ర‌మేశ్ టెండూల్క‌ర్ గురువారం ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్స్ మైదానం స్టాండ్స్‌లో క‌నిపించాడు. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టు లండ‌న్ టూర్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ టెస్గు, టీ20 సిరీస్‌ల‌ను ముగించుకున్న టీమిండియా... 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా గురువారం లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో రెండో వ‌న్డే ఆడుతోంది.

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు లండ‌న్ వెళ్లిన స‌చిన్ స్టాండ్స్‌లో ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీతో క‌లిసి స‌చిన్ క‌నిపించారు. మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను చూస్తూ ఆయ‌న కేరింతలు కొట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Team India
England
Lord's
London
Sachin Tendulkar
BCCI

More Telugu News